క్రోత్తవి 

నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కార్యక్రమాలను నకలు(కాపీ) కొడుతున్న తెలంగాణ నాయకులు అన్న మాటలలో నిజం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రతిపక్షం,  ఆంధ్ర ప్రతిపక్షాలని చక్కగా కాపీ కొడుతుంది.


నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం పెట్టిన అవిశ్వాస ఆయుదాన్ని తెలంగాణ లో కూడా వాడాలని అనుకుంటున్నాయి. కాని అంతకన్నా బుద్ది తక్కువ పని ఇంకోటి ఉండదు అని నా భావాన. ఎందుకంటే 97-78 చాలా వరకు దగ్గరగా పోరుసలుపుతున్న "తెలుగు దేశం" మరియు ప్రధాన ప్రతిపక్షం "వై.ఎస్.ఆర్. కాంగ్రెస్" కి, ప్రస్థుతం 81-38 తెలంగాణాలో మంచి పట్టు మీద ఉన్న "తెలంగాణా రాష్ట్రీయ సమితి" తో కొనప్రాణంతో వ్రేలాడుతున్న ప్రతిపక్షం ని పోల్చటం ఎంతవరకు సమంజసం .

అయినా అసెంబ్లీలలో కూర్చునే వారికి కూడా ఎదో ఒక విధంగా పొద్దు పొడవాలిగా..! ఇవాలా కొట్లాడాలి, రేపు "తిట్టాలి", ఎల్లుండి "వాక్ అవుట్" అనాలి. పాపం ఎప్పుడు అవేనా, అప్పుడప్పుడు ఇలా అవిశ్వాసం వంటి క్రొత్తపదాలు కొత్త నాయకులకు అర్ధం అయ్యేలా ఆచరణాత్మకం గా చూపించాలి కదా అందుకేనేమో..!?  

గమనిక: పార్టీలు దూకారో లేదో పూర్తిగా తెలియనందున పైన తెలిపిన అంకెలు కొంచం మారవచ్చు. కాని పరిస్థితి కాదు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట

No Comment to " నిద్ర లేచిన తెలంగాణ ప్రతిపక్షం..! "

You can embed images by posting image link as [img]imagelink[/img]