మొన్నటి వరకు విజయ మాల్యా ఎవరో అన్ని వర్గాల వారికి తెలిసిన తెలొయకపొయినా ఇప్పుడు మాత్రం అందరికి తెలిసిందంటే మాత్రం డబ్బులు ఎగ్గొట్టి పారపోవడం ఒక కారణం అయితే అదే సమయంలో ఒక తమిళ రైతుపై జరిగిన దాడి (మరి డబ్బులు తిరిగి రాబట్టే పద్దతి అది కాదు అందుకే అది దాడి).
రుణాలు ఇచ్చేవారు కూడా సిగ్గులేకుండా మోసం చేసి కడుపు నింపుకునే/కడుపు కొట్టే వాళ్ళనే గొర్రెలలా నమ్ముతారు. అందుకేగా 7000 కోట్లు అప్పులుగా ఇచ్చారు కనీస వివరాలు కూడా లేకుండా.
ఎమైయిన విజయ మాల్యకు దేశం వదిలి పారిపొడానికి "విమానాలు" ఉన్నాయి, అక్కడ నుంచి Twitter లో సందేశాలు ఇవ్వడానికి హాయిగా తిరిగి తిని త్రాగి జీవించడానికి డబ్బులు కూడా ఉన్నాయి. పాపం రైతుకి మాత్రం ముందు పెద్ద కుటుంబ భారం, వెనక కావలసినన్ని అప్పులు అయిన కరునించని ప్రకౄతి మాత్రమే ఉన్నది. రైతు కు కూడా పారిపొయే అవకాశం ఇస్తే ఎంతబాగున్ను. అయిన తప్పు రైతులదే. తనకు తాను పండించుకుని ఒక సంవత్సరం తింటే, రెండో ఎడాదికి దేశం మొత్తం దారిలోకి వస్తుంది..! రాదంటారా..?
రైతే దేశానికి వెన్నెముక
అందుకే వారి వెన్ను విరగగొట్ట చూస్తున్నారు. :(

No Comment to " విజయ్ మాల్యా vs భారత రైతు "
You can embed images by posting image link as [img]imagelink[/img]