క్రోత్తవి 

పొద్దు పొద్దున్నే అంతర్జాలంలో[Internet] వార్తలు చూస్తుంటే కనిపించిన అంశం. 
అక్కడ ఎమి జరిగిందో పూర్తిగా తెలియని ప్రకటకుడు [Anchor] సాగదీస్తు మీ మధ్య గొడవ తీర్చడానికే అంటు గొడవ పెంచుతుంటే దెబ్బలతో ఉన్న "శ్రీ"కాంత్ ఓర్పు లేకుండా మాట్లాడుతుంటే[నిజంగానే ఓర్పు గా ఉండటం చాలా కష్టం], నాలాగే పొద్దున్నే పని పాటా లేకుండా చూసే వాళ్ళలో కొంత మంది (చీ)"ధీరులకు", "మధు" [ఒక ఆడపిల్ల అని కూడా లేకుండా] ఎవడో ఒకడు తప్పు చేసాడు అని అందరు మగాల్లని అనటం బాగోలేదని, తెలుగు లో ఉన్న/లేని చెప్పుకోలేని [అసభ్య] పదాలను వాడుతు తిడుతున్నారు[వ్యాఖ్యనిస్తున్నారు]. తను కూడా ఏ మాత్రం బుద్ది లేకుండా "ప్రతి నా కొడుక్కి" లాంటి పదాలు వాడటం ఎంత మాత్రం సమంజసం కాని విషయం.



ఆమే నేను "ప్రముఖా"[Celebrity] అనే పదం వాడటం వీళ్ళకు నచ్చలేదంట. ఒకవేళ "ప్రముఖం" కాకపొతే టెలివిజన్[TV] వారు ఎందుకు అంత గోలా చేస్తారు. పొని కాకపొవచ్చు, పొగరే ఉంది సరే, ఇలాంటి [వాళ్ళకు] పనికిరాని విషయాలకు లేచే నోరు ఇన్నాళ్ళు ఎం అయ్యిందో. 
మరి ఇన్నాళ్ళు ప్రభుత్వం లో ఉన్న తప్పులను ఎత్తి చూపించడానికి, అన్యాయం చేసే రాజయకీయ నాయకులను నిలదీయడానికి, లంచం తీసుకునే అధికారులను పట్టించడానికి  లేవని "మగాడు" అప్పుడే లేసాడెమో. 
అయిన ఇవాల కొట్టుకుని రేపు కలిసిపోయే వాళ్ళని ఎంతమంది ని చూడలేదు అని, వాటి గురించి వీళ్ళు కొట్టుకుంటారు ఎందుకో..!?

గమనిక : నేను ఇద్దరికీ అభిమానిని కాదు, వ్యతిరేకిని కాదు. కాని మనకు అవసరం లేని విషయాలకు స్పందిచే మనం అవసరం అయిన వాటిని ఎందుకు వదిలేస్తున్నామో అని అనుమానం వచ్చిన "వాక్" స్వతంత్రం కలవాడిని మాత్రమే. 

Tags:

No Comment to " ప్రేమ పెళ్ళి వివాదం [మధుప్రియ vs శ్రీకాంత్] "

You can embed images by posting image link as [img]imagelink[/img]